కిరణ్‌ కుమార్‌ రెడ్డి కల గర్భంలో కలిశాడు..పీయూష్ కూడా పుట్టగతులు లేకుండా పోతాడు- ప్రశాంత్ రెడ్డి

-

నిజామాబాద్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి..మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భీంగల్ మండలంలోని పలు గ్రామాల్లో వాగులపై చెక్ డ్యామ్ ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి ప్రశాంత్ రెడ్డి.

ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. శానసభలో తెలంగాణకు ఒక్క రూపాయి ఇచ్చేడి లేదన్న కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు కల గర్భంలో కలిపోయాడు… ఇప్పుడు కూడా తెలంగాణ ధాన్యం కొనేది లేదన్న కేంద్ర మంత్రి పీయూష్ గోషాల్, వాళ్ళ పార్టీ కూడా త్వరలోనే పుట్టగతులు లేకుండా పోతుందని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర ప్రభుత్వ ధాన్యం కొనుగోలు వైఖరిని ముందే గమనించిన కేసీఆర్ రైతులకు రెండవ దశలో వరి వద్దని చెప్పినారని.. బండి సంజయ్ విద్వేషపూరితంగా రైతులకు ధాన్యం పండించాలని కేంద్రంతో కొనుగోలు చేసేలా చేస్తామని రెచ్చగొట్టాడని ఫైర్‌ అయ్యారు. బండి సంజయ్ నిజంగా మొనగాడైతే ఒక పార్టీ అధ్యక్షుడైతే ఢిల్లీ వెళ్లి తెలంగాణ ధాన్యం కొనుగోలు చేసేవిదంగా చేయాలని సవాల్ విసిరారు మంత్రి ప్రశాంత్ రెడ్డి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version