తెలంగాణ రాజకీయాల్లో త్వరలోనే మరోకొత్త శక్తి రాబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే రోజుకో పార్టీలో కొత్త శక్తులు పుట్టుకొస్తున్న వేళ మరో రాజకీయ ప్లాట్ ఫామ్ దూసుకురావడానికి రెడీ అవుతోంది. ఆయన పేరే ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్. ఈయన మొదటి నుంచి గురుకులాల కార్యదర్శిగా తన సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో ఇమేజ్ సంపాదించారు. ఇక ఐపీఎస్‌గా కూడా ఎంతో మంచి పేరు ఉంది. స్వేరోస్ ను ఏర్పాటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు.
ఇక ఇప్పుడు తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఆయన తన ఐపీఎస్ పదవికి కూడా వీఆర్ఎస్ తీసుకున్నారు. ఇక ఇప్పుడు ఆయన టీఆర్ఎస్‌లోకి వెళ్తారని, లేదంటే కాంగ్రెస్ లోకి వెళ్తారనే ప్రచారం సాగుతున్న సమయంలో ఆయన ఇటు టీఆర్ఎస్ మీద కాంగ్రెస్ మీద కూడా ఎన్నో విమర్శలు చేస్తూనే ఉన్నారు. దీంతో ఆయన ఈ రెండు పార్టీల్లో చేరే అవకాశం లేదని తెలుస్తోంది.
అయితే ఆయన మొదటి నుంచి బహుజన నినాదంతోనే వస్తున్నారు. ఇక ఆయన రీసెంట్‌గానే మాయావతిని కూడా కలిసి వచ్చినట్టు ప్రచారం సాగుతోంది. ఇక బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా తెలంగాణలో మాజీ ఐపీఎస్ ఆఫీసర్ తమ పార్టీలో చేరేందుకు వస్తున్నారని ప్రకటించినట్టు జాతీయ మీడియా వెళ్లడించింది. దీంతో ఇప్పుడు దళిత, బహుజన వర్గాల్లో ఈ విషయం తీవ్రంగా చర్చనీయంశమైంది. ఇక త్వరలోనే ఆయన నల్గొండ వేదికగా తన రాజకీయ ప్రస్థానం బీఎస్పీ నుంచి ప్రారంభిస్తారని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.