యువజన కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. జక్కిడి శివచరణ్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మాకు పాలనే సరిపోతుంది.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత యువజన కాంగ్రెస్ నేతలదే అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యత ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
కష్టపడి పని చేసిన నేతలకు స్థానిక ఎన్నికల్లో టికెట్లు ఇప్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అనుంబంధ సంఘాల నేతలైన 37 మందికి కార్పొరేసన్ చైర్మన్ పదవులు ఇచ్చి.. కేబినెట్ ర్యాంకు ఇచ్చామని పేర్కొన్నారు. కష్టపడే వారికి తప్పనిసరిగ్గా ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. కాంగ్రెస్ నేతలు ఎవ్వరూ డబ్బులు ఖర్చు చేసి గెలవలేదని.. అందరూ ప్రజాభిమానంతోనే గెలిచారని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్, కవిత దగ్గర లారీల కొద్ది డబ్బులున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.