తెలంగాణకు నిధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ పై యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తాజాగా యువజన కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. జక్కిడి శివచరణ్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఏం పాపం చేసిందని నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు నిర్మాణానిని నిధులు కేటాయించడం లేదని ఇందుకు కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రానికి రూపాయి ఇస్తే.. మనకు 42 పైసలు ఇస్తుందని. బీహార్ రూపాయి ఇస్తే.. 7 రూపాయలు ఇస్తున్నారు. యూపీ రూపాయి ఇస్తే.. 3 రూపాయలు ఇస్తున్నారని వెల్లడించారు. త్వరలోనే కార్యచరణ రూపొందింస్తామని.. అవసరం అయితే మోడీ పై యుద్ధం చేస్తామని చెప్పారు. తెలంగాణ పట్ల కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.