తెలంగాణ పౌరుషాన్ని తట్టి లేపిన తెలంగాణ ఉద్యమ స్పూర్తి ప్రదాత ప్రొ.జయశంకర్ : బండి సంజయ్

-

తెలంగాణ పౌరుషాన్ని తట్టి లేపిన తెలంగాణ ఉద్యమ స్పూర్తి ప్రదాత అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ట్వీట్ చేసారు. తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు. అనంతరం ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దాదాపు ఆరు దశాబ్దాల తెలంగాణ పోరాటానికి ఊపునిచ్చిన ఉద్యమ శిఖరం, పుట్టుక మీది, చావు మీది.. బ్రతుకంతా తెలంగాణది అని తెలంగాణ పౌరుషాన్ని తట్టి లేపిన తెలంగాణ ఉద్యమ స్పూర్తి ప్రదాత అని కొనియాడారు. మరోవైపు తెలంగాణ సిద్ధాంత కర్త, ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అని కేంద్ర మంత్రి ఎక్స్ లో రాసుకొచ్చారు. విద్యార్థి దశ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ కీలక పాత్ర పోషించారు. విద్యార్థుల్లో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపుతూ.. నాయకులకు తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని తెలియజేస్తూ.. పోరాటానికి దిశా నిర్దేశం చేస్తూ అనునిత్యం ప్రత్యేక రాష్ట్రం కోసం పరితపించారు జయశంకర్ సార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version