33 మున్సిపాలిటీల్లో 100 క్యాంటీన్లు ప్రారంభించనున్నాం : మంత్రి నారాయణ

-

33 మున్సిపాలిటీల్లో 100 క్యాంటీన్లు ప్రారంభించనున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. తాజాగా  రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్న క్యాంటీన్లు ఏర్పాటు, డ్రైన్లల్లో పూడిక తొలగింపు పై కమిషనర్లకు సూచనలు చేసిన మంత్రి. వివిధ ప్రాంతాల్లో క్యాంటీన్ భవనాలు నిర్మాణం జరుగుతున్న తీరుపై మంత్ర్ నారాయణ ఆరా తీశారు.

డ్రైన్లల్లో పూడిక తీత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 15వ తేదీన రాష్ట్రంలో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం. రాబోయే వారం రోజులు అన్న క్యాంటీన్లపై కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. క్యాంటీన్ భవనాల్లో కిచెన్ ఏర్పాటు చేసే టీములతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ  వీడియో కాన్ఫరెన్సుకు  మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, డైరెక్టర్ హరి నారాయణన్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version