ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి సోషల్ మీడియాలో చేసిన రీ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఏప్రిల్ 12న పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై స్మిత సబర్వాల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను రీపోస్టు చేసినట్టే రెండు వేల మంది చేశారు. వాళ్లందరిపైనా ఇలాంటి చర్యలు తీసుకుంటారా..? అని ప్రశ్నించారు. తాజాాగా మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ స్మితా సబర్వాల్ తీరుపై స్పందించారు.
ఒక ఐఏఎస్ అధికారినిగా ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని నిందించే పోస్టులు పెట్టడం సరికాదన్నారు. దాని కంటే రాజకీయాల్లో చేరితే సరిపోతుంది కదా అని వ్యంగంగా మాట్లాడారు. బీఆర్ఎస్ యాక్టివిస్ట్ లా స్మితా ప్రవర్తిస్తోందనే విమర్శలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే స్టేట్ మెంట్స్ ఇస్తోంది. ఆమె HCU భూములపై మాట్లాడింది ఒకే దేశంలో జరుగుతున్న ఇతర పర్యావరణ సమస్యలపై ఎప్పుడూ మాట్లాడలేదేం అని ప్రశ్నించారు.