పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కి ప్రాధాన్యత ఇస్తూనే.. ప్రజలకు సేవల విషయంలో మానవీయ కోణం చూపాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏఐ ఆధారిత స్మార్ట్ వ్యవస్త ఏర్పాటుతో రియల్ టైమ్ లో సేవలు అందించవచ్చని.. ఇందుకోసం పాత విధానాల స్థానంలో నూతన సాంకేతికతను ప్రవేశపెట్టాల్సి ఉందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ అంశం పై సచివాలయంతో తాజాగా వర్క్ షాప్ ను ప్రారంభించి ప్రసంగించారు సీఎం చంద్రబాబు.
ఆర్టిఫిషియల్య ఇంటిలిజెన్స్, ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత, పాలనలో వాటి వినియోగం పై సీఎం మార్గ నిర్దేశం చేశారు. టెక్నాలజీ అనేది ప్రజల కోసం ఉపయోగపడాలని.. రాష్ట్రంలో భారీ డేటా లేక్ ను ఏర్పాటు చేయడం పై దృష్టి పెట్టామని సీఎం పేర్కొన్నారు. 30 ఏళ్లనాడు చేసిన ప్రయత్నంతో నేడు ఏపీ టెక్నాలజీ లో కీలకంగా ముందుందని ప్రస్తావించారు. ప్రభుత్వ వ్యవస్థల్లో మేథా సంపత్తి ఉన్నవారు ఉన్నప్పటికీ పాత విధానాలు అనుసరిస్తున్నారని మారాలన్నారు.