సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆస్తి పన్ను కట్టలేదు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆస్తి పన్ను బకాయి రూ.5.5 కోట్లు గా ఉంది. ఈ మేరకు రెడ్ నోటీసులు జారీ చేసింది జీహెచ్‌ఎంసీ. బల్దియా ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లకు సంబంధించి షాకింగ్ విషయాలు వెల్లడించిన జీహెచ్ఎంసీ అధికారులు… రెడ్ నోటీసులు జారీ చేశారు. జీహెచ్ఎంసీకి కొంతమంది కోట్ల రూపాయల పన్నులను ఎగవేసినట్లు అధికారులు గుర్తించారు. ఏళ్లుగా పన్నులు చెల్లించకపోవడంతో అవి కోట్ల రూపాయలకు చేరుకున్నట్లు నిర్ధారించారు.
ఒక్క ఖైరతాబాద్ జోన్ పరిధిలోనే 100 మందికి రెడ్ నోటీసులు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. నోటీసులకు స్పందించకపోతే ప్రాపర్టీ సీజ్ చేస్తామని బల్దియా అధికారులు హెచ్చరించారు. రూ.5 లక్షలకు పైన ఉన్న బకాయిల విలువ ఏకంగా రూ.860 కోట్లని అధికారులు తేల్చారు. జూబ్లీహిల్స్ లాండ్ మార్క్ ప్రాజెక్ట్ బకాయి విలువ రూ.52 కోట్లని, ఎల్ అండ్ టీ మెట్రో రైలు బకాయి రూ.32 కోట్లని అధికారులు గుర్తించారు. హైదరాబాద్ ఆస్బెస్టాస్ సంస్థ రూ.30 కోట్లు చెల్లించాలని, ఇండో అరబ్ లీగ్ రూ.7.33 కోట్లు చెల్లించాలని పేర్కొన్నారు.