హైదరాబాద్ లో 8 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణ రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి. హైదరాబాద్ క్రైమ్స్ అదనపు కమిషనర్‌గా విశ్వ ప్రసాద్ నియామకం చేశారు తెలంగాణ రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి. హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా జోయల్ డేవిస్ బదిలీ అయ్య్యరు.

సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా గజారావు భూపాల్ నియామకం అయ్యారు. సీఐడీ ఎస్పీగా నవీన్ కుమార్, గవర్నర్ ఏడీసీగా శ్రీకాంత్, సీఐడీ ఏడీసీగా రామ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఎస్పీగా శ్రీధర్ నియామకం చేశారు తెలంగాణ రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి. హైదరాబాద్ ఎస్బీ డీసీపీగా చైతన్యకుమార్ ను నియామకం చేశారు తెలంగాణ రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి. ఈ మార్పులు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది