షేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన చేస్తున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డిని, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని అక్రమ అరెస్టు చేశారంటూ ధర్నా చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. పోలీస్ స్టేషన్ లోకి మీడియాను పోలీసులు అనుమతించడం లేదని సమాచారం. మాజీ మంత్రి మల్లారెడ్డిని, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

మల్లారెడ్డి,ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని పేట్‌బషీరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్లారెడ్డిని పేట్‌బషీరాబాద్ పీఎస్‌కు తరలించారు పోలీసులు. సుచిత్ర పరిధిలోని సర్వే నెం.82లో భూ వివాదం నేపథ్యంలో…. ల్యాండ్ దగ్గరకు వచ్చి హల్‌చల్ సృష్టించారు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే… జీ మంత్రి మల్లారెడ్డిని, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.