పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్తున్నాడు..!

-

పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్తున్నాడని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ అన్నారు. సొంత పార్టీని ఓడించాలని చూసిన చరిత్ర నిది….గతంలో కురకుల నాగభూషణం ను మోసం చేసిన మాట వాస్తవం కాదా.. అని ఫైర్ అయ్యారు పువ్వాడ అజయ్‌. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో నువ్వు బచ్చా పొంగులేటి….60 ఏళ్ళు ఇక్కడ రాజకీయం చేసిన పువ్వాడ కొడుకుని గుర్తుపెట్టుకో అని సవాల్‌ చేశారు.

నీ పక్కన ఉన్న వ్యక్తులు రైతులను మోసం, దొంగలు మోసగాళ్లు ఉన్నారని.. మట్టి గుట్టల గురించి మాట్లాడే ప్రతి మాట అవాస్తవమేనని పేర్కొన్నారు. ఖమ్మం అభివృద్ధి అంటే లైట్లు కాదు ప్రతి మూలనే అభివృద్ధి చేశాం…ఎన్నికల్లో నువ్వు ఏ బచ్చాను పెట్టినా నేను ఎదుర్కొంటా నువ్వు వచ్చిన ఎదుర్కొంటానని ఛాలెంజ్‌ చేశారు పువ్వాడ అజయ్‌. వైరా ఎమ్మెల్యే మదన్ లాల్ ను ఓడించింది నువ్వు కాదా….ఎన్నికలలో నీ వర్గానికి 5 సీట్లు ఇస్తే ఒక్కరినైనా గెలిపించావా అని ఫైర్‌ అయ్యారు. ఫార్చునర్ కార్ నుండి రోల్స్ రోవర్ కారుకు ఎదిగావు కదా…అని ఆగ్రహించారు. హ్యాట్రిక్ కొట్టబోతున్నాం….దమ్ముంటే ఆపుకో అని సవాల్‌ చేశారు పువ్వాడ అజయ్‌.

Read more RELATED
Recommended to you

Latest news