ఆర్టీసీ ప్రస్తుతం 560 కోట్ల నష్టంలో ఉంది -పువ్వాడ

-

తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఎస్‌ ఆర్టీసీ ప్రస్తుతం 560 కోట్ల రూపాయల నష్టంలో ఉందన్నారు పువ్వా. ప్రజా రవాణాలో టీఎస్ ఆర్టీసీ ప్రధాన పాత్ర పోషిస్తుంది.. కరోనా దెబ్బకు బస్సులు డిపోలకే పరిమితమై.. రోజుకి కోటి రూపాయలు కూడా రాలేదని వివరించారు.

కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీలో తీసుకుంటున్న చర్యల వల్ల పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పారు మంత్రి పువ్వాడ అజయ్. టీఎస్‌ ఆర్టీసీ ప్రస్తుతం 560 కోట్ల రూపాయల నష్టంలో ఉందని…. నష్టాలు తగ్గించటానికి మరింత బలంగా పనిచేయాలని పేర్కొన్నారు. 760 కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చాయి.. నాన్ ఏసీ, ఎలక్ట్రిక్ బస్సులు హైదరాబాద్ లో నడపటానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు పువ్వాడ అజయ్‌.

Read more RELATED
Recommended to you

Latest news