Icc world cup 2023 : హైదరాబాద్ లో ఉప్పల్ వేదికగా 3 మ్యాచ్ లు

-

ఐసీసీ 2023 క్రికెట్ వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల అయింది. తాజాగా ఐసిసి దీనికి సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. పదేళ్ల తర్వాత జరిగే ఈ ప్రపంచకప్ వన్డే టోర్నీకి భారత్ వేదిక కానుంది. టోర్నీ 2023 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో మొత్తం 10 టీమ్ లు పాల్గొంటున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరుగుతుందని తెలుస్తోంది.

ఐసీసీ 2023 క్రికెట్ వరల్డ్ కప్ షెడ్యూల్ లో భాగంగా హైదరాబాద్ లో ఉప్పల్ వేదికగా 3 మ్యాచ్ లు జరుగనున్నాయి. హైదరాబాద్, వైజాగ్ మినహా … అన్ని ప్రధాన నగరాల్లో ఇండియా మ్యాచ్ లు జరుగనున్నాయి. అక్టోబర్ 6 న పాకిస్థాన్ క్వాలిఫైర్ మ్యాచ్, అక్టోబర్ 9న న్యూజిలాండ్ క్వాలిఫైర్ మ్యాచ్, అక్టోబర్ 12న పాకిస్థాన్ రెండో క్వాలిఫైర్ మ్యాచ్ జరుగనుంది.

 

ఇండియా మ్యాచ్ లు

అక్టోబర్‌ 8: భారత్‌ vs ఆస్టేలియా

అక్టోబర్‌ 11: భారత్‌ vs అఫ్గానిస్తాన్‌

అక్టోబర్‌ 15: భారత్‌ vs పాకిస్తాన్‌

అక్టోబర్‌ 19: భారత్‌ vs బంగ్లాదేశ్‌

అక్టోబర్‌ 22: భారత్‌ vs న్యూజిలాండ్‌

అక్టోబర్‌ 29: భారత్‌ vs ఇంగ్లండ్‌
నవంబర్‌ 2: భారత్‌ vs క్వాలిఫయర్‌

నవంబర్‌ 5: భారత్‌ vs సౌతాఫ్రికా

నవంబర్‌11: భారత్‌ vs క్వాలిఫయర్

Read more RELATED
Recommended to you

Latest news