తెలంగాణ గ్రూప్ 4 పరీక్ష లో బలగం ప్రశ్న

-

బలగం సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం సృష్టించిందో కొత్తగా చెప్పనక్కర్లేదు. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం.. ఓవైపు కలెక్షన్లు.. మరోవైపు అవార్డులు సొంతం చేసుకుంది. ప్రాంతీయ చిత్రంగా విడుదలై.. అంతర్జాతీయ అవార్డులను దక్కించుకుంది.

ఇక ఈ సినిమాతో.. ‘జబర్దస్త్‌’ షోతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హాస్య నటుడు వేణు యెల్దండి దర్శకుడిగా తన ప్రస్థానం ప్రారంభించాడు. ‘బలగం’ చిత్రంతో దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని అందుకున్నారు. అయితే… తాజాగా బలగం సినిమా పై తెలంగాణ గ్రూప్ 4 ఎక్జామ్ లో ఓ ప్రశ్న వచ్చింది. మ్యాచింగ్‌ ది ఫాలోయింగ్‌ క్వశ్చన్‌ కింద బలగం సినిమా పై తెలంగాణ గ్రూప్ 4 ఎక్జామ్ లో ఓ ప్రశ్న వచ్చింది. ఇప్పుడు ఈ విషయం హాట్‌ టాపిక్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news