ప్రజాక్షేత్రంలోకి రా.. తేల్చుకుందాం! – సీఎం కేసీఆర్ కి రఘునందన్ రావు సవాల్

-

నిరుద్యోగ మహాధర్నాకు భారీ ఎత్తున తరలివచ్చిన యువ కిశోరాలకు ఉద్యమ అభినందనలు తెలిపారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్…. ఇందిరాపార్క్ వద్ద జరుగుతున్న ధర్నా సాక్షిగా చెబుతున్నా… సిట్ అధికారులు నాలుగో తరగతి ఉద్యోగులనే ఎందుకు విచారిస్తోందని.. ఉన్నతాధికారులను ఎందుకు విచారించడం లేదు? నిలదీశారు రఘునందన్ రావు.

టీఎస్పీఎస్సీ తాళాలున్న టీఎస్పీఎస్సీ సెక్రటరీ వద్దకు ఇప్పటి వరకైనా సిట్ ఎందుకు వెళ్లలేదు? ఎందుకు ప్రశ్నంచలేదు? అని నిలదీశారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ను ఇంతవరకు సిట్ అధికారులు ఎందుకు విచారించలేదు? నోటీసులు ఎందుకు ఇవ్వలేదని.. అందుకే మాకు సిట్ పై నమ్మకం లేదన్నారు. ఇద్దరు తప్పిదాలవల్లే లీకేజీ జరిగిందన్న కేటీఆర్… ఇన్వెస్టిగేషన్ పూర్తికాకముందే ఇద్దరే దోషులని ఎట్లా ప్రకటిస్తవ్? అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు 13 మందిని అరెస్ట్ చేసి 80 మందికి నోటీసులిచ్చిందని వివరించారు.

సిట్ అధికారులకు చిత్తశుద్ధి ఉంటే… అక్కడున్న సీసీ పుటేజీని ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించారు. ఇవేవీ చేయకుండా ఇద్దరిని మాత్రమే ముద్దాయిలుగా ఇతరులను శుద్ధపూసలుగా ప్రకటించాలని చూస్తున్నరని ఆరోపించారు. సిట్ వద్దు…. సిట్టింగ్ జడ్జితో విచారణే ముద్దు అన్నదే బీజేపీ నినాదం అన్నారు రఘునందన్ రావు. పేపర్ లీకేజీతో నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.

కేటీఆర్ నిజాయితీపరుడైతే… దేశంలో తొలి రైలు ప్రమాదం జరిగితే దానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన తొలి రైల్వే మంత్రి లాల్ బహుదూర్ శాస్త్రీని స్పూర్తిగా తీసుకుని కేటీఆర్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఈ మధ్య కాంగ్రెస్ ను బాగా పొగుడుతున్నడని.. ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని అంటున్నడని… కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ తో కలిసి మీ బీఆర్ఎస్ ఎంపీలంతా రాజీనామా చేసి సంఘీభావం తెలిపాలన్నారు. మాట్లాడితే రాజీనామా చేసిన కేసీఆర్ కు చేతనైతే 9 మంది ఎంపీలతో రాజీనామా చేయించి ప్రజాక్షేత్రంలోకి రా… తేల్చుకుందాం.. అంటూ సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version