రేవంత్ రెడ్డి పాలన గుంపు మేస్త్రి కంటే అధ్వాన్నంగా ఉంది – రఘునందన్‌ రావు

-

రేవంత్ రెడ్డి పాలన గుంపు మేస్త్రి కంటే అధ్వాన్నంగా ఉందని రఘునందన్‌ రావు ఫైర్‌ అయ్యారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎన్నికల్లో బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ కొత్తగూడెం, బిజెపి జిల్లా కార్యాలయంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు రఘునందన్ రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సందిగ్ధంలో ఉంది.

big shock to raghunandhan rao

ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ కి అలవాటు అన్నారు. ఒక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రైతులను మోసం చేసి ఇప్పుడు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.. ఈ జిల్లాలో సన్న బియ్యం ఎంతో.. దొడ్డు బియ్యం ఎంతో.. డిప్యూటీ సీఎం భట్టి ఒక శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ముగ్గురు మంత్రులు ఉన్న ఈ జిల్లా కు ఒక యునివర్సిటీ తీసుకురాలేక పోయారు..గత ప్రభుత్వం కూడా ఇదే అహంకారం తో ఎన్నికల కు పోయి బొక్క బోర్లా పడింది.. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అదే పరిస్థితి కావాలని కోరారు. ఆరు నెలల క్రితం అడ్డగోలు హామిలు ఇచ్చి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ…తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని ఆగ్రహించారు. పూటకో మాట మాట్లాడే కాంగ్రెస్.. పార్టీ కి చదువుకున్న విజ్ఞులు ఓటు వేయకుండా గుణపాఠం చెప్పాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news