జూన్ 4 తర్వాత కేటీఆర్, హరీష్ రావు రోడ్లపై తిరుగుతారు – తెలంగాణ మంత్రి

-

జూన్ 4 తర్వాత కేటీఆర్, హరీష్ రావు రోడ్లపై తిరుగుతారని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాల తరువాత BRS భూస్థాపితం అంటూ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాంబ్‌ పేల్చారు. ఇవాళ మీడియాతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ…పదవి పోయోందనే ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ మాట్లాడుతున్నాడు..ముఖ్యమంత్రిని పట్టుకుని కేటీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఫైర్‌ అయ్యారు.

మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్, జీరో కరెంట్ బిల్లు ఇవ్వడం తప్పా.! అని నిలదీశారు. కాంగ్రెస్ ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు మేమే ఇచ్చినం అని కేటీఆర్ అంటున్నాడు..మీరు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయావని ప్రశ్నించారు. మీ అయ్యా ఫామ్ హౌజ్ లో పడుకుంటే నువ్వే కదా తెలంగాణ రాష్ట్రాన్ని ఫలించినవు.అధికారం చేపట్టగానే న్యాయచిక్కులని తొలగించి ఉద్యోగ భర్తీ చేపట్టినట్లు వివరించారు. దుర్గం చెరువు మీద ఒక కేబుల్ బ్రిడ్జ్ కట్టి అది ఇది చేశామని చెప్తున్నాడు..పరిశ్రమలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news