మెదక్ ఎంపీ సీటు కోసం కేసీఆర్ కుటుంబంలో గొడవలు – రఘునందన్ రావు

-

బీఆర్‌ఎస్‌ పార్టీపై సిద్దిపేటలో మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ కుటుంబంలో మెదక్ ఎంపీ సీటు కోసం గొడవలు జరుగుతున్నాయని బాంబ్‌ పేల్చారు. మెదక్ ఎంపీ సీటు కోసం కవిత పట్టుబడుతుంది…అందుకే హరీష్ రావు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు.

raghunandhan rao on harish and brs

హరీష్ రావు అనుమతితోనే BRS ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ని కలిశారు…మెదక్ జిల్లా BRS ఎమ్మెల్యే లు కాంగ్రెస్ లో చేరుతున్నారని పేర్కొన్నారు. వాళ్ళతో కాసేపటి క్రితం బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టించారని సెటైర్లు పేల్చారు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు.

కాగా, కాంగ్రెస్ అనేది ఎండ్రికాయల పార్టీ.. అందులోకి ఎవడన్నా పోతాడా? అంటూ విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి తెలంగాణకా.. కాంగ్రెస్ పార్టీకా? నియోజకవర్గ సమస్యల మీద సీఎంని కలిసాం. రైతుబంధు గురించి అడిగితె కోమటిరెడ్డి చెప్పుతో కొట్టండి అని అన్నాడు, ఇది సంస్కారమా అంటూ ఫైర్‌ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news