గణతంత్ర దినోత్సవం ఎందుకు? జనవరి 26న ఎందుకు జరుపుకుంటాం..?

-

ఏటా రిపబ్లిక్ డేని భారత దేశంలో ఘనంగా జరుపుకుంటాం. దీనికి తోడు ప్రభుత్వ కార్యాలయాలకు, సంస్థలకు నేడు సెలవు దినంగా కూడా ప్రకటిస్తారు. స్వాతంత్ర దినోత్సం నాడు దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కాబట్టి జరుపుకుంటాం..మరి ఈ రిపబ్లిక్ డేని ఎందుకు ఇంత ఘనంగా జరుపుకుంటామనేది మెజార్టీ నేటి యువతలో క్లారిటీ లేదు.  అసలు రిపబ్లిక్‌డేను జనవరి 26నే ఎందుకు జరుపుకోవాలి? అనే ఈ ప్రశ్నకు సరైన సమాధానం చాలా మందికి తెలియదు. చాలా మంది పుస్తకాల్లో, ప్రసంగాల్లో విన్న విషయాలను పరిగణంలోకి తీసుకుని దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సిద్ధించింది కాబట్టి స్వాతంత్ర్య దినోత్సం.. అలాగే 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి ఏటా ఇదే తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటున్నామని భావిస్తారు.

అయితే ఈ విషయంలో వాస్తవం లేకపోలేదు. వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26నే ఆమోదించారు. ఆ తర్వాత రెండు నెలలకు దీన్ని అమల్లోకి తేవడంతో భారత దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి హక్కులను, బాధ్యతలను గుర్తు చేస్తూ రూపొందించిన రాజ్యాంగానికి, జాతీయ పతాకానికి నేడు సెల్యూట్ చేస్తారు.

లాహోర్ వేదికగా 1930 జనవరి 26న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా పూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు. రావీ నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగురవేసి భారతీయుల సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు. అప్పటి దాకా కేవలం రాజకీయ, ఆధ్యాత్మిక స్వాతంత్రం వస్తే చాలు, సంపూర్ణ అధికారం భ్రిటిష్ వారి చేతుల్లోనే ఉండి, దేశం సామంత రాజ్యంగా మిగిలిపోయినా ఫర్వాలేదనుకున్నారు. అయితే  ఇంతలోనే జలియన్‌వాలాబాగ్ ఉదంతం ఒక్కసారిగా జాతీయ నేతలను ఉలిక్కిపడేలా చేసింది.

ఆ తర్వాత జరిగిన పరిణామాలు, భారత పౌరులు దేశంలో తలెత్తుకుని తిరిగే విధంగా నవభారత నిర్మాతలు రూపొందించిన రాజ్యాంగాని తగిన గౌరవం అందించేందుకు 1949 నవంబర్ 26 తర్వాత మరో రెండు నెలలు ఆగి 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు. దీంతో నాటి నుంచి  భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దుకాబడి, భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శినికులు, మేధావులు రాజ్యాంగ పరిషత్‌‌ను ఏర్పాటుచేశారు. దీనికి అధ్యక్షుడిగా డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ ఎన్నిక కాగా, డాక్టర్‌ అంబేడ్కర్‌ ఛైర్మన్‌గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలం పట్టింది పట్టిన విషయం తెలిసిందే.

‘ వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా, హ్యావింగ్ సొలమన్లీ రిజల్వ్ డ్ టు కన్సిటి ట్యూట్ ఇండియా ఇన్ టూ ఏ సావర్జిన్ డెమెక్రటిక్ రిపబ్లిక్’.. అనే లైన్లు భారత రాజ్యాంగం గొప్పతనాన్ని చాటుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news