తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే కులాల వారీగా జన గణన చేస్తామని ప్రకటించారు రాహుల్ గాంధీ. దేశం సంపదలో పేదలకు వాటా ఇస్తాం.. దేశంలో 5 శాతం ఓబీసీ అధికారులు ఉంటే ఆ వర్గాలకు ఎలా న్యాయం జరుగుతుందన్నారు. కులాల వారీగా జన గణన చేస్తాం.. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కుల జన గణన చేయండి అని అదేశించామని వెల్లడించారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే కులాల వారీగా జన గణన చేస్తామని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం.. మహిళలు ఎక్కడికి వెళ్లినా ఉచిత బస్సు ప్రయాణం అని ప్రకటించారు రాహుల్ గాంధీ. తెలంగాణ ప్రజలు రాజ్యాధికారం చేపట్టాలని ఆశించామని.. కానీ కేసీఆర్ ప్రజలకు దూరమవుతూ వస్తున్నారని తెలిపారు. తెలంగాణలో అధికారం ఒక కుటుంబానికే పరిమితమైందని.. దేశంలోనే అవినీతి ప్రభుత్వం తెలంగాణలోనే ఉందని రాహుల్ ఆరోపించారు. అవినీతి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.