సింగరేణి ఎన్నికల ప్రచారానికి రాహుల్‌ గాంధీ

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీతో గెలిచి అధికారం చేజిక్కించుకుని కొత్త ప్రభుత్వాన్ని నెలకొల్పిన కాంగ్రెస్ పార్టీ.. రానున్న అన్ని ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు రిపీట్ చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే సింగరేణిలో ఈ నెల 27వ తేదీన గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ అనుబంధ సంఘం ఐఎన్‌టీయూసీ (ఇండియన్‌ నేషనల్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌) గెలుపుపై పార్టీ ఫోకస్ పెట్టింది.

ఇందులో భాగంగానే తాజాగా ఐఎన్​టీయూసీ మేనిఫెస్టోను ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విడుదల చేశారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు.. ఐఎన్‌టీయూసీ తరఫున ప్రచారానికి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ హాజరుకానున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఆరు జిల్లాలో విస్తరించిన కోల్‌బెల్ట్‌ ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తారని మంత్రి వెల్లడించారు. అనంతరం పెద్దపల్లిలో జరిగే బహిరంగ సభలో కార్మిక సమస్యల పరిష్కారంపై భరోసా కల్పిస్తారని వివరించారు. శాసనసభ ఎన్నికల్లో కోల్‌బెల్ట్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు దుద్దిళ్ల కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news