తెలంగాణ ప్రాంత వాసులకు బిగ్ అలర్ట్. ఇవాళ, రేపు పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచనలు జారీ చేశారు. అదిలాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ఆసిఫాబాద్, ములుగు, కరీంనగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్, మెదక్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.
వర్షంతో పాటు ఒక గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు మీస్తాయని స్పష్టం చేశారు. రేపు అధికంగా వర్షం కురిసే అవకాశం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఏపీలో కూడా రేపు వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అధికంగా వర్షాపాతం నమోదు అయ్యే అవకాశం ఉంది.