కామారెడ్డిలో దారుణం.. రూ.2 కాయిన్ మింగిన రెండేళ్ల బాలుడు..!

-

చిన్నపిల్లలు… తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తూ ఉంటారు. మనం వద్దన్న పనిని మాత్రమే చేస్తూ చికాకు తెప్పిస్తారు. ముఖ్యంగా చిన్నపిల్లలు.. ఏది పడితే అది నోట్లో పెట్టుకోవడం చాలా కామన్. ఈ నేపథ్యంలోనే కొంతమంది కాయిన్స్, మూతలు లాంటివి మింగేస్తారు. అయితే సరిగ్గా అలాంటి సంఘటనే తెలంగాణ రాష్ట్రంలో జరిగింది.

Atrocity in Kamareddy. A two-year-old boy swallowed a Rs.2 coin
Atrocity in Kamareddy. A two-year-old boy swallowed a Rs.2 coin

రెండు సంవత్సరాల ఓ కుర్రాడు కాయిన్ మింగేశాడు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలానికి చెందిన తన్వీర్ అనే రెండేళ్ల కుర్రాడు రెండు రూపాయల నాణెం మింగాడు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ తరుణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చెందిన వైద్యులు చాలా చాకచక్యంగా ఆ రెండు రూపాయల బిల్లను బయటకు తీశారు. దీంతో తన్వీర్ తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news