Alert : మరికాసేపట్లో తెలంగాణలోని ఈ జిల్లాలలో భారీ వర్షం పడనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కాసేపట్లో పలు జిల్లాల్లో వర్షం కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, జనగాం, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మల్కాజిగిరి, నల్గొండ, హనుమకొండ, సూర్యపేట, యాదాద్రి భువనగిరిలో వర్షం కురుస్తుందని పేర్కొంది. ఆయా జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవోచ్చని అంచనా వేసింది.
ఇక అటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఆవర్తనం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణ, కాకినాడ, అల్లూరి, పార్వతీపురం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని… కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరించింది.