సినిమా చూస్తుండగా పంజాగుట్ట పీవీఆర్ థియేటర్​లో వర్షం

-

హైదరాబాద్ లో ఆదివారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక ఆదివారం కావడంతో చాలా మంది నగరవాసులు సినిమా చూడటానికి థియేటర్లకు వెళ్లారు. అయితే  పంజాగుట్టలో కురిసిన భారీ వర్షానికి పీవీఆర్ సినిమా థియేటర్లో వర్షం నీరు పడింది. కల్కీ మూవీని ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులకు అకస్మాత్తుగా థియేటర్ పై కప్పు నుంచి నీటి చుక్కలు పడటంతో షాకయ్యారు. బయట వర్షం పడుతుంటే థియేటర్లోకి నీళ్లు ఎలా వచ్చాయని ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.

థియేటర్లో వర్షం నీరు పడుతుంటే నిర్వాహకులు మాత్రం షో నిలిపివేయలేదు. షార్ట్ సర్క్యూట్ జరిగి ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ మూవీ చూడడానికి వచ్చిన ప్రేక్షకులు థియేటర్ యాజమాన్యాలతో గొడవకు దిగారు. సినిమా చూసేవారు చూడవచ్చు, వెళ్లేవారు వెళ్లిపోవచ్చు అంటూ థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ప్రేక్షకులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా ఆదివారం సాయంత్రం సమయంలో నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది.

Read more RELATED
Recommended to you

Latest news