విజయసాయిరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి. 2013 నవంబర్ లో పెళ్లి అయ్యింది… మాకు ఇద్దరు కవల పిల్లలు ఉన్నారని తెలిపారు. 2015 లో మాకు పిల్లలు పుట్టారు… నేషనల్ ఓవర్ సీస్ స్కాలర్ షిప్ ఇంటర్వ్యూ కి వెళ్ళామన్నారు. మదన్ మోహన్ మానిపాటి అప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగి… నన్ను దారుణంగా హింసించాడని పేర్కొన్నారు.
రెండేళ్లు నన్ను దారుణంగా హింసించాడు… 2016 లోనే మేము విడాకులు రాసుకున్నామని చెప్పారు. మా గిరిజన సంప్రదాయం ప్రకారం విడాకులు రాసుకున్నాం… 2019 లో మదన్ మోహన్ యూ ఎస్ వెళ్ళిపోయాడని తెలిపింది. నేను, న్యాయవాది సుభాష్ ఇద్దరం ఇష్టపడ్డాం… మేము ఇష్టపడి పెళ్లి చేసుకున్నామని శాంతి తెలిపారు. నేను నవమాసాలు మోసి బిడ్డ ను కన్నాను…. నేను సుభాష్ ని పెళ్లి చేసుకున్నాక కూడా నన్ను వేధించాడని తెలిపింది. మదన్ మోహన్, నేను ఇద్దరం కూడా విశాఖపట్నం కోర్టులో విడాకులు కి తీసుకున్నామని…ఎంపీ విజయసాయిరెడ్డి ని నేను విశాఖపట్నం లోనే చూశాను… ఆయనపై దుష్ప్రచారం చెయ్యడం అత్యంత దారుణం అని చెప్పారు.