తెలంగాణ, ఏపీ ప్రజలకు బిగ్ అలలెర్ట్. నేడు, రేపు అతి భారీ వర్షాలుపడనున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ.

నేడు ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, మెదక్, కామారెడ్డి, భూపాలపల్లి, హనుమకొండ, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు ఉన్నాయని పేర్కొంది హైదరాబాద్ వాతావరణ శాఖ.
మిగతా జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా, తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 24 వరకు వర్ష సూచన ఉందని సూచించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఏపీలో కూడా పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది అమరావతి వాతావరణ శాఖ.