నేడు ప్రభుత్వ హాలిడే… స్కూల్స్ , కాలేజీలు, వైన్స్ బంద్

-

తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు సందర్భంగా ఈ నెల 21న అంటే ఇవాళ్టి రోజున పబ్లిక్ హాలిడే ప్రకటించారు. దింతో ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలతో పాటుగా ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ఉండబోతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ లాంటి జంట నగరాలలో సోమవారం లిక్కర్ షాపులు కూడా మూసివేస్తున్నారు. నిన్న ఆదివారం కావడంతో వరుసగా రెండు రోజులు హాలిడే వచ్చింది.

Schools, colleges, wineries closed
Schools, colleges, wineries closed

ఇప్పటికే గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ అత్యంత వైభవంగా జరుగుతోంది. ప్రతి ఒక్కరూ అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. అమ్మవారి మీద భక్తితో కట్నాలు, కానుకలు సమర్పించారు. కేవలం ఈ సెలవు తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉంటుంది. ఏపీలో సెలవు లేదు. ఏపీలో విద్యాసంస్థలు, ఆఫీసులు యధావిధిగా నడుస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news