తెలంగాణ రాష్ట్ర రైతులకు బిగ్ అలర్ట్.. నేడు ఉత్తర తెలంగాణలో వర్షాలు భారీగా పడనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. నేడు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాదులోనూ తేలికపాటి జల్లులు కురుస్తాయంది.
నిన్న కొమురం భీం, జగిత్యాల, నిర్మల్ లోని పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదయింది. ఇది ఇలా ఉండగా, మహారాష్ట్ర పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ నేడు ఉదయం పండరీపురంలోని విఠల్ రుక్మిణి ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేయనున్నారు. 11:30 గంటలకు సర్కోలిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని… ఎన్సీపీకి చెందిన షోలాపూర్ జిల్లా నేత భగీరత్ బాల్కేతో పాటు పలువురిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించనున్నారు. తర్వాత తుల్జా భవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి… నేరుగా హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు.