రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిగ్ అలర్ట్. రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులపాటు వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ పేరుకుంది. ముఖ్యంగా తెలంగాణలోని… కరీంనగర్, జగిత్యాల సిరిసిల్ల, కామారెడ్డి, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, అటు వరంగల్ జిల్లాలో కూడా భారీ వర్షాలు పడే ఛాన్సులు ఉన్నట్లు పేర్కొంది.

ఈదురు గాలులతో పాటు పిడుగులు పడే ప్రమాదం కూడా పంచుకున్నట్లు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. అటు కోస్తా ఆంధ్రాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు మూడు రోజులు పాటు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం పడుతోంది. కూకట్పల్లి జూబ్లీహిల్స్ పంజాగుట్ట ఎర్రగడ్డ ఖైరతాబాద్ లాంటి ప్రాంతంలో నిన్న అర్ధరాత్రి భారీ నుంచి అతి భారీ వర్షం పడుతోంది. ఇవాళ కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. వర్షం పడిన నేపథ్యంలో హైదరాబాద్ నగరవాసులు బయటకి రాకూడదని… హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.