ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. బనకచర్ల ప్రాజెక్టుకు… కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పింది కేంద్ర సర్కార్. బనకచర్లకు పర్యావరణ అనుమతులు తిరస్కరించింది మోడీ ప్రభుత్వం. బనకచర్లపై ఏపీ ప్రతిపాదన ను తిప్పి కొట్టింది. అనుమతులు ఇవ్వలేమని చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇది ఇలా ఉండగా ఈ ప్రాజెక్టు నేపథ్యంలో చంద్రబాబు నాయుడు వర్సెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాల మధ్య గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. బనకచర్ల కారణంగా తెలంగాణ రాష్ట్రం నష్టపోతుందని… చాలామంది వాదిస్తున్నారు. గోదావరి నీళ్లు తెలంగాణకు దక్కకుండా చేసేందుకే ఈ ప్రాజెక్టు కడుతున్నారని కాంగ్రెస్ అలాగే గులాబీ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు.