తెలంగాణకు మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు !

-

Telangana : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. తెలంగాణలో దిగువ ట్రోపో ఆవరణలో తూర్పు గాలులు వీస్తున్నాయని…. వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

rains

కాగా, శుక్రవారం రోజున సిద్దిపేట జిల్లా సింగారంలో 60 మి.మీ, ములుగు జిల్లా మేడారంలో 54 మి.మీ, నల్గొండ జిల్లా తేల్దేవరపల్లిలో 43 మి.మీ, హన్మకొండ జిల్లా దామెరలో 37 మి.మీ, నల్గొండ జిల్లా చందంపేటలో 29 మి.మీ, నాగర్ కర్నూలు జిల్లా వంకేశ్వర్ లో 28 మి.మీ, వరంగల్ జిల్లా నల్లబెల్లిలో 27 మి.మీ, మేడిపల్లి, పాలకుర్తిలలో 23 మి.మీ, వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news