జన్వాడ ఫామ్ హౌజ్ కేసులో రాజ్ పాకాల కు హైకోర్టులో ఊరట లభించింది. శనివారం రాత్రి జన్వాడలోని ఓ ఫామ్ హౌజ్ లో పార్టీ జరగ్గా అందులో అనుమతి లేకుండా విదేశి మద్యంతో పాటు క్యాషినోకు సంబంధించిన వస్తువులు లభ్యం అయ్యాయి. దీంతో అనుమతి లేకుండా పార్టీ నిర్వహించినందుకు పోలీసులు రాజ్ పాకాల, విజయ్ పాకాల పై పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే రాజ్ పాకాల పోలీసులకు చిక్కకుండా వెళ్లిపోవడంతో అతని ఇంటిని పరిశీలించిన తర్వాత..
విచారణకు హాజరు కావాలని మోకిలా పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ఈ నోటీసులపై స్పందించిన ఆయన విచారణకు హాజరయ్యేందుకు రెండ్రోజుల గడువు ఇవ్వాలని పోలీసులకు లేఖ రాశారు. అలాగే తనను అరెస్ట్ చేస్తారనే సమాచారంతో హైకోర్టు లో రాజ్ పాకాల లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు.. రాజ్పాకాలకు 2 రోజుల సమయం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే విచారణలో ఆధారాలు లభిస్తే చర్యలు తీసుకుంటామన్న ఏఏజీ నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలని హైకోర్టు రాజ్ పాకాల కు సూచించింది. ఏది ఏమైనప్పటికి హైకోర్టు నిర్ణయంతో రాజ్ పాకాల కు ఊరట లభించింది.