కాంగ్రెస్ బలహీనంగా ఉంది.. రమ్మని పిలిస్తే వచ్చాను – రాజగోపాల్ రెడ్డి

-

కాంగ్రెస్ బలహీనంగా ఉంది.. రమ్మని పిలిస్తే వచ్చానన్నారు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి. బీజేపీ పార్టీ అందుకే వీడానని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు గెలవబోతోందని కీలక వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సీఎం కేసీఆర్‌ ను ఓడించేందుకు.. బీజేపీలో నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చానన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు మోత్కుపల్లి నరసింహులు. మోత్కుపల్లి నరసింహులుతో పాటు… కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ ను గద్దే దింపేందుకు కాంగ్రెస్ లో చేరానన్నారు. పదవులు నాకు ముఖ్యం కాదని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందని చెప్పారు. కుటుంబ పాలనను అంతం చేస్తానని… కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు గెలవబోతోందని జోష్యం చెప్పారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news