BRS పార్టీలోకి బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వెళతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ వార్తలపై స్వయంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ క్లారిటీ ఇచ్చారు. నేను బీజేపీ పార్టీలో మాత్రమే బతుకుతాను, బీజేపీ పార్టీలోనే చనిపోతాను…వేరే పార్టీలోకి వెళ్లనని పేర్కొన్నారు.
హరీశ్ రావు ను హాస్పిటల్ గురించి కలిశానని..నిన్న మెసేజ్ పెడితే రమ్మన్నాడు.. వెళ్లి కలిశానని క్లారిటీ ఇచ్చారు రాజాసింగ్. ఇదే విషయం లో గతంలో పనిచేసిన హెల్త్ మినిస్టర్ లను కూడా కలిశానన్నారు.
నేను బీఆర్‌ఎస్ లోకి వెళ్తున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు రాజాసింగ్. బీజేపీ సస్పెన్షన్ ఎత్తేయక పోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు ఎమ్మెల్యే రాజా సింగ్. కానీ తాను పార్టీ మారడం అనేది అవాస్తవమని తెలిపారు ఎమ్మెల్యే రాజా సింగ్.