వినేశ్‌ ఫొగాట్‌కు యాంటీ-డోపింగ్‌ ఏజెన్సీ నోటీసులు

-

ఇండియా స్టార్ రెజ్లర్ వినేశ్‌ ఫొగాట్‌కు జాతీయ యాంటీ-డోపింగ్‌ ఏజెన్సీ షాక్ ఇచ్చింది. డోపింగ్‌ నిరోధక నిబంధనలను పాటించనందుకు గానూ ఆమెకు నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించేందుకు రెండు వారాల గడువిచ్చింది.

‘‘డోపింగ్‌ నిరోధక నియమాలను పాటించడంలో మీరు వినేశ్‌ విఫలమైనట్లు స్పష్టంగా తెలుస్తుంది. మా రిజిస్టర్డ్‌ టెస్టింగ్‌ పూల్‌లో మీ పేరును చేర్చినట్లుు 2022 మార్చి, 2022 డిసెంబరులో మీకు ఈ-మెయిల్‌ చేశాం. యాంటీ డోపింగ్‌ నిబంధనల కింద ప్రతి త్రైమాసికానికి ముందు మీరు ఎక్కడున్నారన్న విషయాన్ని ఫైల్‌ చేయాల్సి ఉంటుంది. ఈ త్రైమాసికంలో మీరు ఏ రోజు ఎక్కడుంటారన్న స్పష్టమైన సమాచారాన్ని కూడా ఇవ్వాలి. మీరు చెప్పిన ప్రదేశంలో చెప్పిన సమయానికి డోపింగ్ పరీక్షలకు అందుబాటులో ఉండాలి’’ అని ఏజెన్సీ నోటీసుల్లో పేర్కొంది.

ఇటీవల ఇచ్చిన ఫైలింగ్​లో జూన్‌ 27న ఉదయం 10 గంటలకు హరియాణాలోని సోనిపట్‌లో టెస్టింగ్‌కు అందుబాటులో ఉంటారని చెప్పారని.. కానీ ఆ సమయానికి అందుబాటులో లేకపోవడం చూస్తే నిబంధనలను ఉల్లంఘించినట్లు స్పష్టమవుతోందని నోటీసుల్లో ఏజెన్సీ స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news