గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ మధ్య కాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన రాష్ట్రం మొత్తం ఏ ఒక్క బీజేపీ అభ్యర్థి విజయం సాధించకపోయినా.. గోషామహల్ నుంచి విజయం సాధించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కిషన్ రెడ్డి సైతం ఓడిపోయినప్పటికీ.. రాజాసింగ్ ఒక్కడే విజయం సాధించారు.
తాజాగా రాజాసింగ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి పై అసంతృప్తి వ్యక్తం చేశారు. గులాంగిరి చేసే వారికే టికెట్లు, పోస్టులా..? అని ప్రశ్నించారు. అన్ని పోస్టులు ఒకే పార్లమెంట్ నియోజకవర్గానికా..? మిగతా వారికి ఏమి వద్దా..? అని ప్రశ్నించారు. బీజేపీలో గత కొద్ది రోజులుగా రాజాసింగ్ అసంప్తి గా ఉన్నారు. పలువురు నేతలపై పరుష పదజాలాన్ని ప్రదర్శించారు. తాజాగా మరోసారి నేతలపై ఆరోపణలు చేశారు. గులాంగిరి చేయని వారిని పక్కన పెడుతున్నారని పేర్కొన్నారు. మిగతా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సీనియర్లు, నేతలు లేరా..? అని ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు మరికొద్ది సేపట్లోనే నామినేషన్ దాఖలు చేయనున్నారు.