దేశంలో సాంకేతిక విప్లవానికి రాజీవ్ గాంధే కారణం : సీఎం రేవంత్ రెడ్డి

-

మూసీ నదిలో పేదలు ఎదుర్కొన్న కష్టాలను అధికారులను గుర్తించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో ఇవాళ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. పది నెలలుగా అధికారులు నిద్రహారాలు మానీ  మూసీ పై పని చేస్తున్నారు. 33 బృందాలు మూసీ పై అధ్యయనం చేశాయి. దేశంలో సాంకేతిక విప్లవానికి రాజీవ్ గాంధే కారణం అన్నారు. ప్రపంచంలో ఎక్కడ మేధావులు అవసరం అయినా దేశం నుంచే ఎగుమతి చేస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ విజన్ తోనే దేశం ముందడుగు వేస్తుంది.

అప్పటి పీఎం పీవీ నరసింహారావు సరళీకృత విధానంతోనే ప్రపంచంలోని దేశాలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి.  కంప్యూటర్ తో ఉద్యోగాలు, ఆదాయాలు పెరిగాయి. నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడమే మా యోచన అన్నారు. బందిపోటు దొంగల్లా పదేళ్లు పీడించి దోచుకున్నారు. మూసీకి జీవం పోస్తుంటే.. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నాలుగు యూట్యూబ్ లతో అధికారం వస్తుందని భావిస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకొని స్వేచ్చగా తిరుగుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version