జ్యోతిష్య శాస్త్రంలో చెట్లు, మొక్కలకి ఎంతో ప్రాధాన్యత ఉంది. కొన్ని చెట్లు మొక్కలు చాలా ముఖ్యమైనవి. జాతకంలో గ్రహాలు నక్షత్రాల దుష్ప్రభావాలను తొలగిస్తాయి. ఈ మొక్కల్లో జమ్మి ఒకటి. నవరాత్రుల్లో దుర్గాదేవికి ఎర్రటి పూలతో ఉన్న జమ్మి ఆకుల్ని సమర్పించడం వలన కష్టాలు తొలగిపోతాయి. ఇలా పూజ చేయడం వలన సంతోషం శాంతి కూడా కలుపుతాయి. నవరాత్రుల్లో ప్రతిరోజు దుర్గాదేవికి ఎర్రని మందారం పూలతో పూజ చేయాలి వివిధ పురాణాలు శాస్త్రాల్లో ఎరుపు మందారం పువ్వులతో అమ్మవారికి పూజ చేయడం గురించి వివరించబడింది.
జమ్మి పువ్వులు ఆకులు కూడా అమ్మవారికి ఎంతో ఇష్టం. అమ్మవారికి ఇష్టమైన షమీ పూలు, మందారం పూలు సమర్పిస్తే దేవి అనుగ్రహం కలుగుతుంది. సుఖశాంతులు కూడా కలుగుతాయి కష్టాల నుంచి బయటపడొచ్చు. జమ్మి ఆకులకు సంబంధించిన ఒక పురాణం ఉంది. దసరా రోజున దశరథ మహారాజు జమ్మి చెట్టు నుంచి బంగారు నాణేలను అందుకున్నాడు. అందుకని అప్పటినుంచి కూడా దసరా రోజున శమీ వృక్షాన్ని పూజించే సంప్రదాయం వచ్చింది.
అంతేకాకుండా పాండవుల మధ్యముడు జమ్మి చెట్టు మీద నుంచి ధనస్సుని దసరా రోజు తీసుకున్నాడని అంటారు. కనుక దసరా ఉత్సవాల ముగింపులో పదవ రోజైన దసరా నడు శమీ వృక్షాన్ని పూజించడం వలన ఇంట్లో సిరిసంపదలు కలుగుతాయి. ఈ మొక్కను ఇంట్లో ఎక్కడ పాతిపెట్టాలి అనే విషయానికి వస్తే.. ఇంటి ఆవరణలో నాటడం చాలా మంచిది. తూర్పుదిక్కున జమ్మి చెట్టుని ఉంచి నిత్యం పూజ చేసి దీపం వెలిగిస్తే ఎంతో మంచి జరుగుతుంది ఇంట్లో జమ్మి చెట్టు ఉండడం వలన శని దోషం తొలగిపోతుంది జమ్మి ఆకుల్ని ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవడం వలన తంత్ర మంత్రం ప్రతికూల శక్తి ప్రభావం ఉండదు.