బంగారు తెలంగాణ కాదు.. శవాల తెలంగాణ – రాకేష్‌ మాస్టర్

-

రాకేష్‌ మాస్టర్‌ పరిచయం అక్కరలేని పేరు. నిన్న మెన్నటి వరకు సినిమా స్టార్స్‌పై తనదైన శైలిలో విరుచుపడ్డ డ్యాన్స్‌ మాస్టర్‌ రాకేష్‌ ఇప్పుడు రూటు మార్చి తెలంగాణ సీఎంపై ఫైర్‌ అయ్యాడు. ప్రజలను పట్టించుకోకుండా రోడ్లపైకి వదిలేశారంటూ.. ఇలాగే కొనసాగితే బంగారు తెలంగాణ కాదు శవాల తెలంగాణ అవుతుందంటూ విమర్శించాడు.

జలుబు, దగ్గు వస్తే తమకేమైందో తెలియని పరిస్థితిలో ప్రజలను వదిలేశారని, వైద్యం కోసం లక్షలకు లక్షలు ఎక్కడినుండి వస్తాయిని ప్రశ్నించాడు. ప్రజలందరూ సీఎం కేసీఆర్‌పై వీడియో తీయండంటూ పిలుపునిచ్చాడు. అధికారం ఉందని ప్రశ్నిస్తే జైల్లో పెట్టించడం కాదు. ఇంటింటికీ కరోనా టెస్టులు చెయ్యండని, మీ కన్నా చిన్నవాడు జగన్మోహన్ రెడ్డి ఇంటింటికీ పరీక్షలు చేయిస్తున్నాడన్నాడు.

ప్రజలు చావాలా..? మీకైతే డబ్బులు కావాలా..? మేమేమైనా మీ ఇంటికొచ్చి అన్నం అడుకుంటున్నామా. మా ఇళ్లకొచ్చి నువ్వే ఓట్లు అడుక్కున్నావు. నమ్మి ఓట్లేస్తే ఇప్పుడు నువ్వు చేస్తున్న పనేంటంటూ ఏకవచనంలో మాట్లాడాడు. ఇంకా మీ మనవళ్ళకి, మనవరాల్లకి ఏమైనా ఉంటే తట్టుకుంటారా.? అందరు కూడా అలాగే ఉంటారని చెప్పుకొచ్చారు. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని, వచ్చే సంవత్సరం ప్రభుత్వం పడిపోతుందంటూ జోష్యం చెప్పారు. కరోనా వైరస్‌పై అవగాహన పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, వైన్‌ షాప్‌లను బంద్‌ చెయ్యాలని, ఎప్పుడూ సంపాదించడమేనా..?? అంటూ విమర్శలు చేశాడు. కడుపు కాలి మాట్లాడుతున్నానని, బెందిరించట్లేదు మిమ్మల్ని అలాగని భయపడట్లేదని మీ ముఖ్యమంత్రి పదవికి గౌరవమిస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు.

రాకేష్‌ మాస్టర్‌ చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ శ్రేణులు విరుచుకు పడుతున్నాయి. మందు ఎక్కువై మాట్లాడుతున్నాడంటూ సెటైర్లు వేస్తున్నారు. హీరోయిన్లపై విజ్ఞత మరచి మాట్లాడే నువ్వు సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేసే స్థాయి ఉందా అంటూ ప్రశ్నించారు. తన యూట్యూబ్‌ ఛానెల్‌ను ప్రమోట్‌ చేసుకోవటానికే ఈ చిల్లర కామెంట్లు చేస్తున్నాడని, ఈ నటన ఏదో సినిమాల్లో చేసుంటే బాగుపడేవాడంటూ చురకలు వేస్తున్నారు. బూతులు మాట్లాడుతూ అమ్మాయిలపై అసభ్య పదజాలం వాడుతూ చేసిన కామెంట్లపై కంప్లైంట్‌ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇక ఇది ఇలా ఉంటే శ్రీ రెడ్డిని రంగంలోకి దించే ప్రయత్నాలు చేస్తున్నారంట.

రాకేష్‌ మాస్టర్‌ ముందుగా ఆవేశం తగ్గించుకుంటే మంచిది. కోపం వల్ల మాట విలువ పోతుంది. చెప్పాలనుకున్న విషయాన్ని శాంతంగా చెబితే ఎలాంటి సమస్యా ఉండదు. ప్రతీ దానికి యాంగ్రీ ఓల్డ్‌ మ్యాన్‌ టైప్‌లో మాట్లాడితే విషయం తప్పుదోవ పట్టే అవకాశం ఉంది. రాకేష్‌ మాస్టర్‌ వీడియో మొత్తం చూస్తే తను చెప్పాలనుకుంది సలహాలాగా ఉంది కానీ చెప్పే విధానం మాత్రం వెటకారంగా ఉంది. ఇంకా గౌరవ సీఎంను ఇంతలా నువ్వు.. నువ్వు అంటూ ఏకవచనంలో సంభోధించడం అస్సలు బాగోలేదు. తిట్టినట్టుగా చెలరేగి మాట్లాడటం సమర్థనీయం కాదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version