నెల్లూరులో భారీ ప్రమాదం…!

-

ఆంధ్రప్రదేశ్ లో వరుస ప్రమాదాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. లాక్ డౌన్ సమయంలో మూత పడి ఇప్పుడు ఓపెన్ అయిన కొన్ని కంపెనీలు ప్రమాదాలకు వేదికగా మారుతున్నాయి. తాజాగా… మరో ప్రమాదం నెల్లూరు జిల్లా ప్రజలను బాగానే కంగారు పెట్టింది. నెల్లూరులో కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. వింజమూరు మండలం చంద్రపడియ వద్ద వెంకట నారాయణ యాక్టివ్ ఇంగ్రిడియంట్స్ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులకు గాయాలు కాగా… ఒకరి పరిస్థితి విషమంగా మారింది. వారిని నెల్లూరు నారాయణ హాస్పిటల్ కి తరలించారు. వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు అగ్నిమాపక సిబ్బంది. సమాచారం అందకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు పోలీసులు. గతంలోనూ ఈ కెమికల్ ఫ్యాక్టరీలో పలు ప్రమాదాలు జరిగాయని… అయినా సరే యాజమాన్యం జాగ్రత్తలు తీసుకోవడం లేదు అనే ఆరోపణలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version