మంచిర్యాలలో ప్రజలను, రియల్ ఎస్టేట్ వ్యాపారస్థులను భయభ్రాంతులకు, ఇబ్బందులకు గురి చేస్తూ హత్యాయత్నం, అక్రమ ప్రవేశం, బెదిరింపులకు, దాడులు వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కుంట శ్రీనివాస్ పై రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ జారీచేసిన పీడీయాక్ట్ ఉత్తర్వులను మంచిర్యాల పట్టణ ఇన్స్ స్పెక్టర్ ప్రమోద్ రావు, నిందితుడికి ఆదిలాబాద్ జిల్లా జైల్ లో ఉత్తర్వులు అందజేసి చర్లపల్లి జైలుకు తరలించారు. పీడీ యాక్ట్ అందుకున్న నిందితుడు గత కొన్ని నెలలుగా మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యాయత్నం, భూ కబ్జాలకు పాల్పడడం, అక్రమంగా ఇతరుల ఆస్థి లలోకి ప్రవేశించడం, బెదిరింపులలకు, దాడులకు పాల్పడడం తో 04 కేసులు నమోదు చేయడం జరిగింది. అట్టి కేసులలో అరెస్ట్ చేసి జైలుకు తరలించడం జరిగింది.
అలాగే గతంలో రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య కేసులో జైలుకు వెళ్ళిన అతని నేర ప్రవృత్తి తీరులో మార్పు రాకపోవడంతో నిందితుడి పై పిడి యాక్ట్ నమోదు చేయడం జరిగిందని పోలీస్ కమీషనర్ తెలిపారు. గ్రూప్ లుగా ఏర్పడి గొడవలకు పాల్పడి శాంతి భద్రతలకు ఎలాంటి విఘతాం కలిగించే చర్యలకు పాల్పడిన, హత్య యాత్నలకు, హత్య లకు పాల్పడిన నిందితులు, అక్రమ ఫైనాన్స్, గంజాయి అక్రమ రవాణా చేసే వారి, పేకాట, పిడియస్ రైస్ అక్రమ రవాణా, భూ కబ్జాలకు పాల్పడే, వైట్ కాలర్ అఫెండార్స్ జాబితా సిద్ధం చేయడం జరిగిందని త్వరలో వారిపై పిడి అమలు చేస్తాం అని తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది, సహించేది లేదని వారిపై చట్టపరమైన చర్యలతో పాటు పీడీ యాక్ట్ క్రింద కేసు నమోదు చేయబడుతుందని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు