జగన్ పై బురద చల్లడానికే పవన్ పర్యటనలు : మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి

-

జగన్మోహన్ రెడ్డి 20 ఏళ్ల క్రితం కొన్న భూములపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపణ లు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పర్యటనలో అభివృద్ధి పనులపై సమీక్ష ఉంటుందని ప్రజలు ఆశించారు, కానీ అలాంటిదేమీ జరగలేదు. జగన్ మోహన్ రెడ్డి పై బురద చల్లడానికే పవన్ కళ్యాణ్ పర్యటన కు వచ్చినట్లు ఉంది అని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు హైకోర్టులో కేసులు వేసి సరస్వతి భూములను వినియోగించుకో లేకుండా చేశారు.

అయితే పల్నాడులో అనేక మంది సిమెంట్ ఫ్యాక్టరీల పేరుతో స్థలాలు తీసుకొని ఫ్యాక్టరీలు కట్టలేదు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వారిపై చర్యలు తీసుకోవాలి అని తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారు. సరస్వతి భూములకు సంబంధించిన వ్యవహారంలో ఫారెస్ట్ ల్యాండ్ ఉంటే విచారణ జరిపి ఆ భూములు రికవరీ చేసుకోవచ్చు అని పేర్కొన్నారు కాసు మహేష్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news