బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ బంపర్ ఆఫర్ ఇచ్చిందట. చేవెళ్ల లోకసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా రంజిత్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చినట్లు సమచార అందుతోంది. చేవెళ్ళ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి..కాంగ్రెస్ పార్టీ లో చేరనున్నారు. ఈ తరుణంలోనే చేవెళ్ళ లోకసభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి ఫైనల్ అయ్యారట. రేపు జరిగే కాంగ్రెస్ పార్టీ సిఈసి సమావేశంలో రంజిత్ రెడ్జి అభ్యర్ధిత్వానికి ఆమోదం తెలపనుందట.
కాగా, పసునూరి దయాకర్ పార్టీ వీడి 24 గంటలు కూడా గడవకముందే చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు.ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాను ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ఎంపీ రంజిత్ రెడ్డి సోషల్ మీడియా వేదిక ఎక్స్లో పోస్టు చేశారు. ఇన్ని రోజులు పార్టీలో ఉండి చేవెళ్ల ప్రజలకి సేవ చేసేందుకు అవకాశాలు కల్పించిన పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన రాజీనామా ఆమోదించాలని వారికి విజ్ఞప్తి చేశారు. ఇన్నాళ్లూ బీఆర్ఎస్ పార్టీలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు రంజిత్ రెడ్డి.