శంషాబాద్ ఎయిర్​పోర్టుకు రికార్డు స్థాయిలో ప్రయాణికుల రాకపోకలు

-

హైదరాబాద్​లోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల రాకపోకల్లో రికార్డు క్రియేట్ చేసింది. ఈ విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్లేవారి సంఖ్య.. విదేశాల నుంచి వస్తున్న అతిథుల రాకపోకలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. జులై నెలలో 3.68 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులు, 16.40 లక్షల మంది దేశీయ ప్రయాణికులకు సేవలు అందించింది. ఈ విషయాన్ని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కొద్దిరోజుల కిందట అధికారికంగా వివరాలను వెల్లడించింది.

దేశంలోనే అత్యధిక విమాన ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయాల్లో శంషాబాద్‌ నాలుగో స్థానంలో ఉంది. చెన్నై, కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయాలను వెనక్కి నెట్టి ఈ ఘనతను సాధించింది. శంషాబాద్‌ విమానాశ్రయం ఏర్పాటైన అయిదున్నరేళ్లకే రద్దీ పెరగడం, పదిహేనేళ్లకు దాదాపు రెట్టింపు ప్రయాణికులు రాకపోకలు కొనసాగించడంతో ఏటా 3.4 కోట్ల మంది రాకపోకలకు అనుగుణంగా విస్తరిస్తున్నారు. ప్రస్తుతం నెలకు 20 లక్షల మంది అంతర్జాతీయ, దేశీయ ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి 80కి పైగా దేశీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమాన సర్వీసులున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news