వెస్ట్ ఇండీస్ పురుషుల జట్టులో కీలక ప్లేయర్ గా ఉన్న నికోలస్ పూరన్ కెప్టెన్సీ నుండి బయటకు వచ్చేశాక తన బ్యాటింగ్ స్టైల్ లో పూర్తిగా భిన్నమైన శైలిని చూపిస్తున్నాడు. అమెరికా లో జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ ఫైనల్ లో నికోలస్ పూరన్ సెంచరీ చేసి కప్ ను న్యూ యార్క్ ముంబై ఇండియన్స్ కు అందించాడు. అనంతరం స్వదేశంలో ఇండియాతో జరిగిన సీరియస్ లోనూ బ్యాట్ తో రాణించి జట్టుకు కీలకంగా మారాడు. ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ట్రింబాగో నైట్ రైడర్స్ తరపున ఆడుతున్నాడు. కాగా డిసెంబర్ లో ఆస్ట్రేలియా దేశవాళీ లీగ్ అయిన బిగ్ బాష్ లీగ్ లో ఆడుతాడని వార్తలు వచ్చాయి.
కానీ తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం తనకు జాతీయ కమిట్మెంట్స్ ఉండడం కారణంగా నికోలస్ పూరన్ బిగ్ బాష్ లీగ్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు.. ఇది నిజంగా పూరన్ అభిమానులకు హెయిర్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి.