తెలంగాణలో 10 ఉమ్మడి జిల్లాల్లో..9 జిల్లాలు ఒక ఎత్తు అయితే..ఖమ్మం జిల్లా మరొక ఎత్తు. మిగిలిన 9 జిల్లాల్లో బిఆర్‌ఎస్ పార్టీకి పట్టుంది గాని..ఖమ్మంలో మాత్రం పెద్దగా పట్టు లేదు. అధికార బలంతో ఇతర పార్టీల నేతలని తీసుకున్నారు. కానీ ఖమ్మంలో బిఆర్‌ఎస్ కు అనుకున్న మేర పట్టు దొరకలేదు. దీంతో బిఆర్‌ఎస్ పార్టీకి ఖమ్మంలో గెలుపు అనేది చాలా దూరంలో ఉంది.
ఇక ఆ జిల్లాలో బిఆర్‌ఎస్ పార్టీ ఇంతవరకు గెలవని సీట్లలో వైరా కూడా ఒకటి. 2008 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన ఈ వైరాలో 2009 ఎన్నికల్లో సిపిఐ విజయం సాధించింది. ఇక రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో ఊహించని విధంగా వైరాలో వైసీపీ గెలిచింది. వైసీపీ నుంచి బానొత్ మదన్‌లాల్ గెలిచారు. అప్పుడు టిడిపి సెకండ్ ప్లేస్ లో ఉండగా, సిపిఐ మూడు, బిఆర్‌ఎస్ నాల్గవ స్థానంలో నిలిచింది. అయితే తెలంగాణలో వైసీపీ కనుమరుగు కావడంతో మదన్ బిఆర్‌ఎస్ లోకి వచ్చారు.
2018 ఎన్నికల్లో బిఆర్‌ఎస్ నుంచి మదన్ పోటీ చేశారు. అయితే కాంగ్రెస్-టిడిపి-కమ్యూనిస్టుల పొత్తులో భాగంగా వైరా సీటు సిపిఐకి దక్కింది. అదే సమయంలో ఇండిపెండెంట్ గా రాములు పోటీ చేశారు. అప్పుడు కాంగ్రెస్ శ్రేణులు రాములుకు సపోర్ట్ చేయడంతో మదన్ పై రాములు గెలిచారు. ఇండిపెండెంట్ గా గెలిచిన రాములు..నెక్స్ట్ బిఆర్‌ఎస్ లోకి వచ్చారు.
కానీ ఎమ్మెల్యేగా ఆయన వ్యతిరేకతని ఎదుర్కోవడంతో కేసిఆర్..సీటు ఇవ్వకుండా..మదన్‌కు సీటు ఇచ్చారు. దీంతో బిఆర్‌ఎస్ నుంచి మదన్ రెడీ అయ్యారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి ఫిక్స్ కాలేదు. కాకపోతే కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటే..ఈ సీటు కాంగ్రెస్ వదులుకునే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్-కమ్యూనిస్టులు కలిసి పోటీ చేస్తే బిఆర్‌ఎస్ గెలుపు కష్టమవుతుంది. పొత్తు లేకపోతే ఓట్లు చీలి బిఆర్‌ఎస్‌కు ప్లస్. చూడాలి మరి వైరాలో గులాబీ జెండా ఎగురుతుందో లేదో.