తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త అందింది. తెలంగాణలో కొత్తగా 1890 స్టాఫ్ నర్సుల ఖాళీలను భర్తీ చేయాలని సర్కారు నిర్ణయించింది. గత ఏడాది డిసెంబర్ లో 5204 స్టాఫ్ నర్సుల పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే.
దానితో కలిపి మొత్తం 7094 పోస్టులకు నియామకాలను చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఆ మేరకు సేవల నియామక మండలికి అనుమతినిచ్చింది. మొత్తం పోస్టుల్లో మూడోవంతు మహిళలతోనే భర్తీ చేయనుంది.