ప్రధాని మోడీపై రేగా కాంతారావు వివాదస్పద వ్యాఖ్యలు..దున్నపోతు అంటూ !

-

దేశ ప్రధాని నరేంద్ర మోడీపై టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే రేగా కాంతారావు వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. దున్నపోతు అంటూ ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. ఇవాళ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రేగా కాంతారావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంలో ఉండి కూడా నిరసనలు తెలిపే దౌర్భాగ్యం మనకు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల సమస్యలపై కేంద్రానికి లేఖలు పంపించి విన్నవించుకున్నా పట్టించుకోలేదని ఫైర్‌ అయ్యారు ప్రభుత్వ విప్ రేగా.

తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు ఢిల్లీ వెళ్లి రైతుల సమస్యపై క్యాబినెట్ మంత్రులు గోడు విన్నవించుకున్నా మోడీకి దున్నపోతు మీద వర్షం పడిన చందంగా ఉందని ఆగ్ర హించారు. బోర్లు మీద ఆధారపడే రైతులకు ప్రాజెక్టులు కట్టి ప్రభుత్వం పెద్ద పీట వేసి సహకారం అందిస్తుంటే బిజెపికి కళ్ళు మంట అని ఓ రేంజ్‌ రెచ్చి పోయారు ప్రభుత్వ విప్ రేగా. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే రైతులకు అండగా ఉంటుందన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version